: ఎస్సీ వర్గీకరణపై అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు పంపాలని తెలంగాణ విపక్షాల డిమాండ్
తెలంగాణ శాసనసభ తొమ్మిదవరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బీఏసీలో చర్చించిన విధంగా సభను సజావుగా సాగనివ్వాలని అధికారపక్షం చెబుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు వర్గీకరణపై తక్షణం చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టడంతో... ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పట్టుబట్టడం సరికాదని స్పీకర్ చెబుతున్నారు. అయినప్పటికీ విపక్షాల ఆందోళనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు పలు మార్లు సభను అడ్డుకోవద్దని సూచించారు. సభను సజావుగా జరగనివ్వాలని కోరారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు, న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.