: చిన్నప్పుడు తల్లితో... దశాబ్దాల తరువాత తిరిగి మల్లన్న సన్నిధిలో గద్దర్.. ముడుపులు చెల్లించుకున్న విప్లవగాయకుడు!


విప్లవ గాయకుడు, ప్రజా కవి గద్దర్ అనూహ్యంగా కొమరవెల్లి మల్లన్న సన్నిధికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. భార్య విమల, కోడలు సరితలతో కలసి దేవాలయానికి వచ్చిన ఆయన, లక్ష బిల్వార్చన, అభిషేకం నిర్వహించారు. ఆపై భజన పాటలు పాడారు. అక్కడి వేద పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆపై మాట్లాడుతూ, తాను చిన్నతనంలో ఒక్కసారి మల్లన్న దర్శనానికి తల్లితో కలసి వచ్చానని, ఆ సమయంలో దేవాలయం మూసి ఉండటంతో దర్శించుకోలేక బయటి నుంచి మొక్కి వెళ్లిపోయానని గుర్తు చేసుకున్నారు. అప్పటి కోరిక ఇప్పటికి తీరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. "కొమురెల్లి మల్లన్నను చూడు.. సొరికెల్లో కొలువై ఉన్నాడు" అంటూ మల్లన్నపై పాట రాశానని, ప్రత్యేక రాష్ట్రం రావాలని ముడుపు కట్టానని చెప్పుకొచ్చారు. విద్యార్థులు వేదాలతో పాటు ఆంగ్ల భాషను నేర్చుకోవాలని, వివేకానందుడి స్ఫూర్తిగా ఎదగాలని గద్దర్ అభిలషించారు.

  • Loading...

More Telugu News