: శ్రీకాకుళంలో ప్రసంగించనున్న పవన్ కల్యాణ్... పర్యటన ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, జనవరి 3న శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను జనసేన ప్రతినిధులు వెల్లడించారు. 2వ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పవన్ విశాఖ నగరానికి రానున్నారు. ఆపై రాత్రి నోవాటెల్ హోటల్ లో బసచేసే ఆయన, మంగళవారం ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరుతారు. ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల పాటు సాగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే భోజనం చేసి, సాయంత్రం 4 గంటల కెల్లా విశాఖ తిరిగొస్తారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో పవన్ సమావేశమవుతారని, తిరిగి 4వ తేదీన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.