: శశికళను కలిసిన సినీ నటి శ్రీదేవి
జయలలిత నెచ్చెలి శశికళను ప్రముఖ సినీ నటి శ్రీదేవి కలిశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత మరణంతో ఆమె నెచ్చెలికి పార్టీ పగ్గాలు అందించేందుకు కసరత్తు జరుగుతున్న తరుణంలో పార్టీ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శశికళను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో పోయెస్ గార్డెన్ లో ఉన్న జయలలిత వేద నిలయానికి శ్రీదేవి వెళ్లడం జరిగింది.