: తిరుమలలో శ్రీవారిని దర్శిచుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్
తిరుపతిలో గత రాత్రి ఆడియో వేడుక జరుపుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. సినిమా యూనిట్ తో వెళ్లిన సినీ నటుడు, హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యుడు బాలకృష్ణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.