: దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతూ చలి తీవ్రతను పెంచుతున్నాయి. విశాఖ ఏజెన్సీ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో స్థానికులు చలికి వణుకుతున్నారు. వేకువ జామున బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. లేహ్ లో మైనస్ 13.9 డిగ్రీలు ఉండగా, లడక్ లో మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్ లో మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వుంది. విశాఖ ఏజెన్సీలోని లంబసింగిలో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుండడం విశేషం.