: పోలవరానికి పునాది రాయే సమాధి రాయి అవుతుందని నేనే విమర్శించా.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
పోలవరం ప్రాజెక్టును మొదట్లో తాను తీవ్రస్థాయిలో విమర్శించానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. ఆ ప్రాజెక్టుకు పునాది రాయే సమాధిరాయి అయిందని పదేపదే విమర్శలు గుప్పించేవాడినని అన్నారు. అయితే ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన ఇన్ని దశాబ్దాల తర్వాత తిరిగి మూడేళ్లలోనే దానిని పూర్తిచేయాలని చంద్రబాబు సంకల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాబార్డు చెక్కును అందించిన సందర్బంగా వెంకయ్య పై వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి 'ఇవ్వడం', చంద్రబాబుకు 'చెయ్యడం' తప్ప వేరే పనిలేదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్న ప్రతిసారి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గుర్తొస్తారని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పేరు చెబితే మోదీ, చంద్రబాబు గుర్తొస్తారని వెంకయ్యనాయుడు అన్నారు.