: 'కేర్ టేకర్' వెంకయ్యనాయుడుకు, 'ఏపీ ఫ్యూచర్' చంద్రబాబుకు ధన్యవాదాలు: బోయపాటి


తెలుగు రాష్ట్రాల కేర్ టేకర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల 'భవిష్యత్' చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. నవరస నటసార్వభౌమ నందమూరి ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. గజగజ వణికించే చలిలో వేడిపుట్టించాలంటే బాలయ్యబాబు నటన చూడాలి, భగభగలాగే మంటలో కన్నీటి బందువు రాల్చాలన్నా ఆయన నటనే చూడాలని బోయపాటి చెప్పాడు. లెజెండ్ వెయ్యిరోజులు పూర్తి చేసుకుందని ఆయన గుర్తుచేశాడు. 'చరిత్ర నెలకొల్పాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే' అన్న డైలాగ్ ను లెజెండ్ సినిమాతో నిరూపించారని అన్నారు. అమరావతి ఘన చరిత్ర ప్రతి తెలుగు వాడికీ తెలియాలని ఈ సినిమాను తీస్తున్నారని బోయపాటి చెప్పారు. ఇది వందో సినిమా కాదని, వంద సెంటర్లలో వందరోజులు ఆడే సినిమా అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News