: ఈసారి తప్పకుండా తెలుగులోనే మాట్లాడుతాను: చిరంతన్ భట్
ఈ చారిత్రాత్మక సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ తెలిపారు. తిరుపతిలో ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించడం గొప్ప విషయమని, ఆ గొప్ప విషయంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. తెలుగు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, మరోసినిమాకు మ్యూజిక్ చేసే సరికి తెలుగు నేర్చుకుంటానని చెప్పారు. సిరివెన్నెల అద్భుతమైన లిరిక్స్ అందించారని, ఆయనకు ధన్యవాదాలని తెలిపారు. సంగీతం అందర్నీ ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఆయన ఆకాంక్షించారు.