: గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేదికకు చేరుకున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుక వేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఒకే కారులో వీరిద్దరూ కలసి రావడం విశేషం. ఈ సందర్భంగా వారికి శాసనసభ్యుడు, సినిమా ప్రధాన పాత్రధారి బాలయ్య సాదర స్వాగతం పలికారు. వారి ఆగమనాన్ని సూచిస్తూ సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వారి రాకతో అభిమానులు కేరింతలు కొట్టారు.