: 'కుమ్ముడు' అంటే ఇదే!: 'ఖైదీ నెంబర్ 150'పై లహరి మ్యూజిక్
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఖైదీ నెం.150 ఆడియో రికార్డులను కుమ్మేస్తోంది. ఈ సినిమాలోని 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అంటూ సాగే పాటను నెటిజన్లు అద్భుతంగా ఆదరించిన సంగతి తెలిసిందే. దీంతో అతి తక్కువ వ్యవధిలో 20 లక్షల వ్యూస్ తో రికార్డు నెలకొల్పింది. ఇదే పాట వారం రోజులు తిరిగేసరికి యూ ట్యూబ్ లో రికార్డులను తిరగ రాస్తూ దూసుకుపోతోందని లహరి మ్యూజిక్ తెలిపింది. వారం రోజుల్లో 60 లక్షల (6 మిలియన్ల) హిట్లను సాధించిందని చెబుతూ, లహరి మ్యూజిక్ అధికారిక ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మూడో పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమాలో 'అమ్మడు కుమ్ముడు', 'సుందరి' పాటలు విడుదలైన సంగతి తెలిసిందే.