: వాజ్ పేయీ మన మధ్య లేకున్నా... ఆయన గురుతులున్నాయని అనేసి.. నాలుక్కరుచుకున్న బీజేపీ నేత


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ మన మధ్య లేకపోయినా ఆయన తీపి గురుతులు మనవద్ద ఉన్నాయని బహిరంగ సభలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... అటల్ బిహారీ వాజ్ పేయీ పుట్టిన రోజును పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ నేతలు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆగ్రాలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలను బీజేపీ నిర్వహించింది.

 ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలీఘడ్ మేయర్ శకుంతల మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన తీపి గురుతులు మన మధ్య సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో అక్కడ కలకలం రేగింది. శకుంతలాదేవి వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. కాసేపటికి జరిగిన తప్పు గుర్తించిన శకుంతల.. వాజ్ పేయీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షించారు. జరిగిన తప్పిదానికి సభికులకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై విమర్శలు ఆగలేదు. 

  • Loading...

More Telugu News