: ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ ఫోన్లేవో తెలుసా?


స్పెసిఫికేషన్స్ పరంగా 2016 మేటి స్మార్ట్ ఫోన్ జాబితాను నిపుణులు వెల్లడించారు. ఈ జాబితాలో యాపిల్ 7 ప్లస్ నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే యాపిల్ 7 ప్లస్ ను ఎంచుకోవచ్చని వారు తెలిపారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్, వైడ్ యాంగిల్, టెలిఫోన్ లెన్స్ కాంబినేషన్ తొలి డ్యుయల్ ఫ్రంట్ కెమెరా తదితర సౌకర్యాలు ఈ ఫోన్ ను నెంబర్ వన్ గా నిలబెట్టాయని తెలిపారు.

దీని తరువాతి స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ నిలిచింది. ఇందులో సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ తో పాటు, ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సల్ కెమెరా ఉండడం కలిసివచ్చింది. దాని తరువాతి స్థానంలో గూగుల్ పిక్సల్ ఫోన్ నిలిచింది. తొలిసారి గూగుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చినప్పటికీ యాపిల్, శాంసగ్ హైఎండ్ ఫోన్లకు పోటీ ఇవ్వడం విశేషం. దాని తరువాతి స్థానంలో వన్ ప్లస్ 3 స్మార్ట్ ఫోన్ వుంది. స్మార్ట్ ఫీచర్స్ తో అందుబాటు ధరల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రావడంతో ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది. దాని తరువాతి స్థానంలో మోటో జెడ్, నుబియా జెట్ నిలిచాయి.

  • Loading...

More Telugu News