: జగన్ మొద్దు నిద్ర వదిలి మేల్కొన్నారు: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎద్దేవా
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మొద్దు నిద్ర వదిలి మేల్కొన్నారని ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా పులివెందులకు నీరు ఇస్తారని ఎవరో చెప్పినట్లుంది, అందుకే, ఆయన ధర్నా చేపట్టారని వ్యంగ్యోక్తులు విసిరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంత నీరు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. చీనీ చెట్లు ఎండిపోకుండా చూడాలని, రైతులకు అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న గండికోట గ్రామం ముంపు వాసులను జగన్ రెచ్చగొడుతున్నారని, సీఎం కు హత్యా రాజకీయాలు ముడిపెట్టడం తగదని అన్నారు.