: ఆ ఇద్దరికీ భయపడటం వల్లే రాయలసీమ నేతలు నోరు మెదపట్లేదు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిసినా సీమ నేతలు నోరు మెదపకపోవడానికి కారణం సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత జగనే నని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీ కెనాల్ హక్కులను కర్ణాటకకు ధారాదత్తం చేశారని, ముచ్చుమర్రి లిఫ్ట్ తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం తగదని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్త ఏడాది జనవరి 18,19 తేదీల్లో కర్నూల్ లో దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపన పనుల్లో జాప్యంపై కేఈ స్పందించడం అభినందనీయమన్నారు.