: ముత్తూట్ ఫైనాన్స్ లో పట్టపగలే 5 కేజీల బంగారం దోపిడీ
ప్రముఖ గోల్డ్ లోన్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ లో మరో భారీ చోరీ జరిగింది. గుజరాత్ లోని ధోరాజి పట్టణంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో జరిగిన దోపిడీలో ఏకంగా రూ. 90 లక్షల విలువైన 5 కేజీల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. ఈ రోజు జరిగిన ఈ దోపిడీలో ముగ్గురు వ్యక్తులు పాలుపంచుకున్నారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బ్రాంచ్ ఆఫీసులోకి ప్రవేశించి, తమ వద్ద ఉన్న నాటు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించారు. లాకర్లు ఓపెన్ చేయకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. అనంతరం బ్రాంబ్ లో ఉన్న 5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.