: 44 ఫోర్లు, 23 సిక్సర్లతో 413 పరుగులు చేశాడు!


క్వాడ్రాపుల్ సెంచరీ (ఒక ఇన్నింగ్స్ లో 400 వ్యక్తిగత పరుగులు) ఫీట్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో బ్రయాన్ లారా పేరిట లిఖితమై వుంది. ఇప్పటికీ ఆ రికార్డు చెరిగిపోకుండా అలాగే నిలిచి ఉంది. తాజాగా సంసద్ లో జరిగిన ఫస్ట్ క్లాస్ డివిజన్ క్రికెట్ లో భారతీయ ఆటగాడు క్వాడ్రాపుల్ సెంచరీ సాధించి సత్తాచాటాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ టోర్నమెంట్ లో బారిషా క్లబ్ ఆటగాడు పంకజ్ క్వాడ్రాపుల్ సెంచరీ సాధించాడు.

 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన పంకజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో (176) 44 ఫోర్లు, (138) 23 సిక్సర్లతో మొత్తం 413 పరుగులు చేశాడు. గత సీజన్ లో రంజీల్లో అరంగేట్రం చేసిన పంకజ్ (28) ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ ఆటలు, నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్ లు, 12 టీ20 మ్యాచ్ లు ఆడాడు. పంకజ్ ఫీట్ తో బారిషా క్లబ్ జట్టు 708/8 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో పంకజ్ ను క్రికెటర్లంతా ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News