: కాంగ్రెస్ కు ఆదిలోనే షాక్ ఇచ్చిన సీపీఎం!


మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే షాక్ తగిలింది. మోదీ అవినీతికి పాల్పడ్డారంటూ తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో.... ఆ ఆరోపణలకు విపక్షాల మద్దతును కూడగట్టాలని కాంగ్రెస్ భావించింది. దీంతో, మంగళవారం నాడు ప్రతిపక్షాలతో కలసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది.

అయితే, ఆ సమావేశానికి తాము హాజరుకావడం లేదంటూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. మీడియా సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరైతే.... తాము రాలేమని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. ఈ నేపథ్యంలో, రేపటి 16 విపక్ష పార్టీల సమావేశానికి ఎవరెవరు హాజరవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. 

  • Loading...

More Telugu News