: బీపీసీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్న ‘ఓలా మనీ’
ఇకపై ‘ఓలా మనీ’ యాప్ ద్వారా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) పెట్రోల్ బంకులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద చెల్లింపులు చేపట్టవచ్చు. ఈ మేరకు బీపీసీఎల్ తో ‘ఓలా మనీ’కి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, దేశ వ్యాప్తంగా ఉన్న బీపీసీఎల్ పెట్రోల్ బంకులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద డిజిటల్ చెల్లింపులు చెల్లించవచ్చని సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు పల్లవ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు ‘ఓలా మనీ’ రీచార్జ్ వ్యాలెట్ పరిమితిని రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పెంచినట్లు చెప్పారు.