: అందులో మాత్రం చంద్రబాబుకు 100 మార్కులు వేయొచ్చు: బొత్స
అవినీతి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందకు వంద మార్కులు వేయవచ్చని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సెటైర్ వేశారు. కేవలం దోపిడీ చేయడానికే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. వ్యవసాయానికి సంబంధించి కనీసం కార్యాచరణను కూడా రూపొందించలేదని మండిపడ్డారు. వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబులో ఉందని... అందుకే ఆయన వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. చంద్రబాబు చెబుతున్న రెండంకెల వృద్ధి లెక్కల్లో తప్ప, వాస్తవంలో లేదని చెప్పారు. 5 శాతం వృద్ధి రేటును 12 శాతంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో వృద్ధి రేటు పెరగడం లేదని... క్రైమ్ రేటు పెరుగుతోందని అన్నారు.