: నేను ఎవరిపైనా అసంతృప్తి వ్యక్తం చేయలేదు: ఉప ముఖ్యమంత్రి కేఈ
ఏపీ సీఎం చంద్రబాబుపై రెండు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు లోని మామిదాలపాడులో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేఈ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. తాను పదవిలో ఉండగానే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.