: ఇక ముక్కు పిండటమే... రోడ్డుపై వాహనం పార్కింగ్ చేస్తే రూ. 200 స్థానంలో వెయ్యి జరిమానా!


నో పార్కింగ్ జోన్ లో వాహనాలను నిలిపివుంచే వారి నుంచి ముక్కు పిండి మరీ భారీ జరిమానాను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్రమ పార్కింగ్ కు ప్రస్తుతం రూ. 200 జరిమానాగా వసూలు చేస్తుండగా, దాన్ని 500 శాతం పెంచి రూ. 1000 వసూలు చేయాలన్నది కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ఆలోచన. అక్రమ పార్కింగ్ జరిమానాను భారీగా పెంచాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. వాహనాలను రోడ్లపై పార్క్ చేసి, రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని నిలువరించడమే తమ లక్ష్యమని, అక్రమ పార్కింగ్ లను గమనించిన ప్రజలు ఎవరైనా, దాని ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖకు పంపవచ్చని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో భవన నిర్మాణ విభాగం కూడా సహకరించాలని, సరైన పార్కింగ్ లేని భవనాలకు అనుమతులు ఇవ్వద్దని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News