: జనవరి 27న మౌని అమావాస్య.. ఆ రోజు మౌనంగా ఉండకపోతే గ్రహాల ప్రభావం తప్పదు: జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ
వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య సమస్యాత్మకమైందని, ఆ రోజున అందరూ మౌనం పాటించాలని ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ సూచించారు. ప్రతి ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య లేదా మౌని అమావాస్య అంటారని, అయితే, వచ్చే జనవరి 27న రానున్న మౌని అమావాస్య చాలా సమస్యలతో కూడుకున్నదన్నారు.
ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని సూచించారు. అంతసేపు మౌనంగా ఉండటం వీలు కాని వారు, కనీసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా మౌనంగా ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మౌనం పాటించకపోతే గ్రహాల ప్రభావం మర్నాటి నుంచే ఉంటుందని విశాఖపట్టణంలో నిన్న మీడియాతో మాట్లాడిన శ్రీనివాస గార్గేయ పేర్కొన్నారు.