: సమాజ్ వాదీలో మళ్లీ ముసలం... తండ్రిని, బాబాయ్ నీ కాదని 403 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్!


మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న సమాజ్ వాదీ పార్టీలో మరో ముసలం ఏర్పడింది. తన తండ్రి, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ ల ప్రమేయం లేకుండా, సీఎం అఖిలేష్ 403 నియోజకవర్గాలకు పార్టీ తరఫున పోటీపడే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం కలకలం రేపింది. సమాజ్ వాదీ పార్టీ విషయంలో కుటుంబ రాజకీయాలు పరాకాష్టకు చేరాయన్న విషయాన్ని అఖిలేష్ వైఖరి మరింత స్పష్టం చేయగా, అది జాబితానే కాదని, దానికి ఆమోదముద్ర లేదని యూపీ మంత్రి, ములాయం ప్రియ సోదరుడు శివపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. లక్నోలో నిన్న సాయంత్రం తాను స్వయంగా తయారు చేసుకున్న జాబితాను విడుదల చేస్తూ, దాన్ని తండ్రికి పంపినట్టు తెలిపారు. కాగా, యూపీలో అసెంబ్లీ టికెట్లను ఎవరికి ఇవ్వాలన్న అధికారాన్ని శివపాల్ కు అప్పగిస్తూ ములాయం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News