: నేడు హైదరాబాదులో రాష్ట్రపతి చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న షారుఖ్ ఖాన్


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. హైదరాబాదులోని మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నేడు షారుఖ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. యూనివర్శిటీ ఆరవ స్నాతకోత్సవం సందర్భంగా ఈ డాక్టరేట్ ఇవ్వనుంది. షారుఖ్ తో పాటు 'రేఖ పౌండేషన్' వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్ కు కూడా డాక్టరేట్ ఇవ్వనుంది. ఉర్దూ భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకు వీరిద్దరకీ గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు డాక్టరేట్లు అందుకోనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ హైదరాబాదులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News