: తమిళనాట మరో పార్టీ.. జయలలిత విక్టరీ సింబల్ తో ఆవిర్భవించిన 'అమ్మ డీఎంకే'!
ఏఐఏడీఎంకే, డీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే, ఏఐఎస్ఎంకే... ఇవన్నీ తమిళనాడులోని రాజకీయ పార్టీలు. వీటి పేర్ల మధ్య ఇప్పటికే ఎంతో కన్ఫ్యూజన్. ఇప్పుడీ కన్ఫ్యూజన్ ను మరింత పెంచుతూ, 'అమ్మ డీఎంకే' అనే కొత్త పార్టీ రిజిస్టర్ అయింది. ద్రవిడ ఇయక్కంలో కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్ తనయుడు ఇనియన్ ఈ పార్టీని ప్రారంభించారు. జయలలిత వర్గాన్ని ఆకర్షించేలా, అన్నా డీఎంకేను పోలిన విధంగా జెండాను తయారు చేసి, రెండాకుల చిహ్నం గుర్తు స్థానంలో జయలలిత రెండు వేళ్లతో చూపే విక్టరీ చిహ్నాన్ని ఉంచిన జెండాను ఇనియన్ తయారు చేయించుకున్నారు. ఇప్పుడీ కొత్త పార్టీ జెండా ఇనియన్ ఇంటిపై రెపరెపలాడుతోంది. అన్నా డీఎంకే పార్టీలో గందరగోళాన్ని సృష్టించేలా ఈ కొత్త పార్టీ పేరుందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.