: నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. వణికిపోతున్న ప్రజలు
నెల్లూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని వింజమూరు, వరికుంటపాడులో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. భూకంపం మళ్లీ వస్తుందేమోనని భయపడుతున్న ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. రోడ్డు పక్కనే కాలక్షేపం చేస్తున్నారు.