: క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఎలిజబెత్ రాణి!


బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 కు బాగా జలుబు చేయడంతో క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు. సండ్రింగ్ హోమ్ లో జరిగే వేడుకలకు ఆమె వెళ్లలేదని బకింగ్ హామ్ ప్యాలెస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలిజబెత్ రాణి క్రిస్మస్ వేడుకులకు దూరంగా ఉండటం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఇదే మొదటిసారని, ఆమెకు బాగా జలుబు చేయడంతో ప్యాలెస్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఎలిజబెత్ రాణి-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా ఈ వారం ప్రారంభం నుంచి జలుబుతో సతమతమవుతున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News