: మరో యాత్రకు ఉరకలేస్తున్న 'బహుదూరపు బాటసారి'


208 రోజుల పాటు 2817 కిలోమీటర్లకు పైగా సాగించిన పాదయాత్ర అందించిన ఉత్తేజంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో యాత్రకు సై అంటున్నారు. అయితే, 'వస్తున్నా.. మీకోసం' పేరిట సాగించిన పాదయాత్ర ప్రజలకోసమని.. తాజా యాత్ర పార్టీ కోసమని బాబు వివరించారు. పార్టీ క్యాడర్ ను పటిష్టపరచడంతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు పరిశీలించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని భావిస్తున్నామని బాబు చెప్పారు. బాబు నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే పార్టీ వర్గాలతో చర్చించి యాత్ర తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News