: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. నేనేమన్నా ముఖ్యమంత్రిని కావాలా?: జేసీ దివాకర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘భవిష్యత్తులో ఏ పదవికి పోటీ చేయను. నలభై సంవత్సరాల పాటు ఈ ప్రజాజీవితం గడిపాను. అన్నీ చూశాను. ఏం సాధించాలి? అయినా నేనేమన్నా ముఖ్యమంత్రిని కావాలా? నాకు విధిరాతపై నమ్మకముంది. నేను ఒకవేళ ముఖ్యమంత్రిని అయి ఉంటే.. రోశయ్యగారి కంటే ముందే కావాలి. కానీ, ముఖ్యమంత్రిని కాలేదు కనుక, ఇక దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు.. వదిలిపెట్టేశా. నా అభిప్రాయం ప్రకారం దేశంలో ఇద్దరే మంత్రులు. ఒకాయన ప్రధాన మంత్రి, మరొకాయన ముఖ్యమంత్రి. ఇతరులందరూ బొమ్మలు. ప్రతిపక్షంలోనే కాదు ,పవర్ పార్టీలోనూ హుందాతనం పోయింది. మంచిని స్వీకరించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎంపీగా నాకు అసలు సంతృప్తిగా లేదు’ అని జేసీ తన మనసులోని మాటలను చెప్పారు.