: జగన్ హండ్రెడ్ పర్సెంట్ ‘రెడ్డి’ కాదు.. ‘క్రిస్టియన్’: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి కాదని, క్రిస్టియన్ అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను నిఖార్సయిన ‘రెడ్డి’ కులస్తుడినని, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా చెబుతానని అన్నారు. ఇదే సమయంలో.. వైఎస్ జగన్.. రెడ్డి ఎలా అవుతాడని.. ఆయన క్రిస్టియన్ అవుతాడని అన్నారు. అదే విధంగా, రఘువీరారెడ్డి కూడా ‘రెడ్డి’ కాదని అన్నారు.
అయినా 21వ శతాబ్దంలో, రేపోమాపో చంద్రుడిపైకి వెళ్లి కాపురాలు పెట్టనున్న పరిస్థితుల్లో ఇంకా కులానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమనేది కరెక్టు కాదన్నారు. రాజకీయంగా ఎవరికైనా, ఎప్పుడైనా వారి మనసులో తన కులంపైన అభిమానం ఉండవచ్చని, అయితే, రాజకీయాల్లో ఈ అస్త్రం పనికిరాదని, అది వారిని నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పి తాను పార్టీ మారలేదని.. ఆ పార్టీ చచ్చిపోయిందని, కుళ్లి కంపుకొడుతోందని ఘాటు విమర్శలు చేశారు. టీడీపీలో తనకు దక్కాల్సినంత గౌరవం తనకు దక్కుతోందని, అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ పథకాలపై చంద్రబాబు దృష్టి పెడతారని ఈ సందర్భంగా జేసీ అన్నారు.