: అది ఒట్టి మాట.. నన్ను డబ్బు అడిగే ధైర్యం జగన్ కు లేదు!: జేసీ దివాకర్ రెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత జగన్ నోటి వెంట ‘మహానేత’ అనే మాట తప్ప ఇక వేరే ఏదీ వినపడదని, గెలిస్తే ఏం చేస్తామనే విషయం మాట్లాడడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, జగన్ కు సీఎం అయ్యే లక్షణాలు లేవని అన్నారు. 'వైఎస్సార్సీపీలోకి వెళ్లాలనుకున్న మిమ్మల్ని జగన్ డబ్బు ఇవ్వమన్నారట గదా?' అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ.. అవి ఒట్టి మాటలేనని, తనను డబ్బు అడిగే ధైర్యం జగన్ కు లేదని, అప్పటి పరిస్థితుల రీత్యా తాను టీడీపీలోకి వెళ్లానని చెప్పారు. తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే అయినా, అంతిమయాత్ర మాత్రం టీడీపీలోనేని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. 

  • Loading...

More Telugu News