: మంత్రి రావెల, జానీమూన్ మధ్య సమసిన వివాదం!
ఏపీ మంత్రి రావెల కిషోర్, గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య వివాదం సమసింది. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో రావెల, జానీమూన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, వాళ్లిద్దరి మధ్య ఉన్న వివాదం చిన్న సమస్యే నని, వారి మధ్య సయోధ్య కుదిరిందని, జిల్లా అభివృద్ధికి వారు కలిసి పనిచేస్తామన్నారని చెప్పారు.
జిల్లా చైర్ పర్సన్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని రావెల ఇస్తారని, వారి మనసుల్లోని భేదాభిప్రాయాలను తొలగించుకున్నారని అన్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం సమసిందని, సద్దుమణిగిన వివాదాన్ని సాగదీయటం సరికాదని ఇరువర్గాలకు ఆయన హితవు పలికారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే వైఎస్సార్సీపీ పన్నిన కుట్రలో భాగంగానే వారి మధ్య వివాదం రేపారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.