: బీజేపీలో చేరిన సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్
పాకిస్తాన్ జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన సరబ్ జీత్ గతంలో మృతి చెందాడు. ఆయన సోదరి దల్బీర్ కౌర్ ఈరోజు బీజేపీలో చేరారు. ఈ విషయం బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, భారత్ లోని పంజాబ్ కు చెందిన రైతు సరబ్ జీత్, అనుకోకుండా దేశసరిహద్దులు దాటడంతో పాకిస్థాన్ పోలీసుల చేతికి చిక్కాడు. 1990లో లాహోర్ లో జరిగిన వరుస పేలుళ్లతో సరబ్ జీత్ హస్తం ఉందనే ఆరోపణలతో ఆయన్ని అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతనికి పాక్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, శిక్ష అమలును పాక్ ప్రభుత్వం పలుమార్లు వాయిదావేస్తూ వచ్చింది. ఈ లోగా 2013లో అక్కడి జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో సరబ్ జీత్ చనిపోయాడు.