: ‘పద్మావతి’ సెట్ లో పెయింటర్ దుర్మరణం


బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘పద్మావతి’ చిత్రం షూటింగులో అపశ్రుతి చోటుచేసుకుంది. ముఖేశ్ డాకియా అనే వ్యక్తి సెట్ పెయింటింగ్ వేస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో, ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ముంబయిలోని ఆరే పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు (ఏడీఆర్) కింద కేసు నమోదు చేశారు. కాగా, దర్శకుడు సంజయ్, నిర్మాతలు కలసి ముఖేశ్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించినట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ సీఈవో శోభా తెలిపారు. ఇదిలా ఉండగా, సెట్ లో సరైన భద్రత నిబంధనలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News