: వాజ్ పేయి పేరు పెట్టాలని నేనే సూచించా: సీఎం చంద్రబాబు
గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గర నిర్మించనున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)కు మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు వాజ్ పేయి పేరు పెట్టాలని తానే సూచించానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాజ్ పేయి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని, దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తి, దార్శనికుడు, పరిపాలనా దక్షుడు వాజ్ పేయి అని చంద్రబాబు ప్రశంసించారు. స్వర్ణ చతుర్భుజి సహా మౌలిక రంగ అభివృద్ధికి వాజ్ పేయి కాలంలో విశేషమైన కృషి జరిగిందని అన్నారు.