: పెట్రోలు బంకుల్లో నిలిచిపోనున్న 'మొబైల్' నగదు చెల్లింపులు!
దేశవ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో మొబైల్ ఫోన్లను వినియోగిస్తూ, నగదు చెల్లింపులు జరపడాన్ని నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. పేటీఎం తదితర మాధ్యమాల ద్వారా మొబైల్ ఫోన్లు వాడి పెట్రోలు బంకుల్లో చెల్లింపులు చేయడం సరికాదని, మొబైల్ ఫోన్లు పేలే ప్రమాదం ఉందని పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజన్ సేఫ్టీ ఆర్గనైజేషన్) నుంచి పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హెచ్చరికలు అందాయి. గతంలో పెట్రోలు బంకుల్లో ఎన్నోమార్లు సెల్ ఫోన్లు పేలిన విషయాన్ని గుర్తు చేస్తూ, బంకుల్లో ఈపోస్ మిషన్ల వాడకం ప్రమాదకరమని, నోట్ల చెల్లింపు ద్వారానే అమ్మకాలు జరిగేలా చూడాలని సూచించింది. దీంతో ఈ వ్యవహారంలో పునరాలోచిస్తున్న కేంద్రం పెట్రోలు బంకుల్లో 'మొబైల్' నగదు చెల్లింపులను నిలిపివేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.