: గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుక కోసం భారీ ఏర్పాట్లు... 500 కార్లతో ర్యాలీ!


బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి పాటల విడుదల వేడుక రేపు సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మునిసిపల్ పాఠశాల మైదానంలో ఘనంగా జరుగనుంది. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబుతో పాటు హేమమాలిని సహా, చిత్ర నటీనటులందరూ రానున్నారని తెలుస్తోంది. తిరుపతిలో బాలకృష్ణ బసచేసే హోటల్ నుంచి 500 కార్లు, వెయ్యి బైకులతో భారీ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీ సింహభాగంలో బాలకృష్ణ ఉంటారని అభిమాన సంఘాలు వెల్లడించాయి. ఎంట్రీ పాసులను వీవీఐపీలకు మాత్రమే ఇస్తున్నామని, సాధారణ అభిమానులు ఎంతమందైనా హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. నేటి సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News