: నల్ల సముద్రంలో కుప్పకూలిన రష్యా విమానం... అందరూ మరణించినట్టే!
ఈ ఉదయం సిరియాలోని సోచీ ఎయిర్ పోర్టు నుంచి లాటకియాకు బయలుదేరిన కాసేపటికే రాడార్ల నుంచి అదృశ్యమైన రష్యా మిలిటరీ విమానం నల్ల సముద్రంలో కుప్పకూలినట్టు తెలుస్తోంది. టీయూ-154 రకానికి చెందిన ఈ విమానం శకలాలు సముద్రంపై కనిపించాయని, సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరాయని అధికారులు తెలిపారు. విమానంలో 82 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో వీరంతా మరణించే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటన వెనుక విద్రోహ హస్తమేమైనా ఉందా? అన్న విషయమై విచారణ జరుగుతుందని రష్యా విమానయాన వర్గాలు తెలిపాయి.