: చారిటబుల్ ట్రస్ట్ ను మూసేస్తున్న డొనాల్డ్ ట్రంప్
తాను దీర్ఘకాలంగా నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ను మూసివేస్తున్నట్టు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశాధ్యక్షుడైన తరువాత, ట్రస్ట్ విషయంలో విమర్శలు ఎదుర్కోరాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నైతికతకు కట్టుబడిన తాను, ఇకపై తన దానధర్మ కార్యక్రమాలను ఇతర మార్గాల్లో నిర్వహిస్తానని తెలిపారు.
గతంలో ట్రంప్ ఫౌండేషన్ పై పలు ఆరోపణలు రాగా, న్యూయార్క్ అటార్నీ జనరల్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ కోర్టు కేసుల పరిష్కారానికి ఫౌండేషన్ నిధులను వినియోగించారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. 2014 చివరకు ఫౌండేషన్ ఆస్తుల విలువ 1.27 మిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, జనవరి 20న ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.