: నవాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు చెప్పిన మోదీ


భారత్, పాకిస్థాన్ ల మధ్య సరిహద్దుల్లో పదేపదే కాల్పులు జరుగుతూ, ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తన వైపు నుంచి స్నేహహస్తాన్ని అందిస్తూనే ఉన్నారు. గత సంవత్సరం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ 67వ పుట్టిన రోజు నాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాకిస్థాన్ లోని లాహోర్ కు వెళ్లి, ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన మోదీ, ఈ సంవత్సరం తన ట్విట్టర్ ఖాతాద్వారా శుభాకాంక్షలు వెల్లడించారు. "పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News