: ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా....!: హల్ చల్ చేస్తున్న నాగార్జున డైలాగ్


నాగార్జున హాథీరామ్ బావాజీ పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ తాజా ట్రైలర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. శనివారం ట్రైలర్ ను విడుదల చేయగా, ఇప్పటికే 6.75 లక్షల మంది దీన్ని చూశారు. "ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా, ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, పదివేల శేషుల పడగల బుసబుసల సాక్షిగా, ఏం చేస్తానో చెప్పను" అంటూ హాథీరామ్‌ బావాజీ చేసిన హెచ్చరికల డైలాగ్ తో ఈ ట్రైలర్ అలరిస్తోంది. కాగా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News