: 'ఖాన్'లను తోసి రాజన్న కోహ్లీ.. షారూఖ్, సల్మాన్‌ల కంటే అతడికే ప్రజాదరణ
బాలీవుడ్ స్టార్ ద్వయం షారూఖ్, సల్మాన్‌ఖాన్ కంటే కూడా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకే ప్రజాదరణ ఎక్కువని తేలింది. ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ కలిగిన సెలిబ్రిటీల్లో విరాట్ కోహ్లీకి అగ్రస్థానం దక్కింది. అయితే వార్షిక ఆదాయంలో మాత్రం ఖాన్ ద్వయం కంటే వెనకబడినా పేరు ప్రఖ్యాతుల్లో మాత్రం తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాలు, టీవీ, పత్రికల ద్వారా అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రముఖుల వివరాలను క్రోడీకరించిన ఫోర్బ్స్ తాజా జాబితాను విడుదల చేసింది. కోహ్లీకి ట్విట్టర్‌లో మొత్తం 1.34 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే.