: ఘనంగా క్రిస్మస్ వేడుకలు..క్రీస్తు పుట్టిన చోటుకు పోటెత్తిన భక్తులు.. ప్రార్థనలతో మార్మోగుతున్న చర్చిలు
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రీస్తు జన్మస్థలంగా భావించే పాలస్తీనాలోని బెత్లెహామ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటివిటీ చర్చి సమీపంలోని మాంగర్ కూడలిలో శనివారం అర్ధరాత్రి ప్రార్థనలతో క్రిస్మస్ వేడుకలు ముగియనున్నాయి. ఇక మన దేశంలోనూ క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన చర్చిలు ప్రార్థనలతో మార్మోగుతున్నాయి. చర్చిలకు చేరుకుంటున్న చిన్న, పెద్ద అందరూ ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.