: మోదీ ముంబై సభలో బలాబలాలు ప్రదర్శించిన బీజేపీ, శివసేన కార్యకర్తలు


ముంబైలోని అరేబియా సముద్రంలో ప్రతిష్ఠాత్మక శివాజీ స్మారక విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్‌ఎమ్‌ఆర్‌ డీఏ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు మెట్రో కారిడార్స్‌, ఇతర ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. ఆ తరువాత భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని ప్రసంగం సందర్భంగా బీజేపీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తే, శివసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ ముగిసిన అనంతరం బీజేపీ, శివసేన కార్యకర్తలు పరస్పరం పార్టీ జెండాలు చూపుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారి, బాహాబాహీకి దిగారు. దీంతో పార్టీ జెండాలే ఆయుధాలుగా మారాయి. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ సభలో ప్రధాని మోదీతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొనడం విశేషం. 

  • Loading...

More Telugu News