: మంత్రి రావెలపై చర్యలు తీసుకోవాలి: జానీమూన్ కు మద్దతుగా ముస్లిం సంఘాల ర్యాలీ
గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ కు ముస్లిం సంఘాల మద్దతు లభించింది. దీంతో గుంటూరులో ముస్లిం సంఘాలన్నీ ఆమెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా, జడ్పీ ఛైర్ పర్సన్ ను ఇబ్బందులపాలు చేస్తున్న మంత్రి రావెల కిషోర్ బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాల పెద్దలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళన తీవ్రతను పెంచుతామని వారు హెచ్చరించారు. దీనికి ప్రతిగా ప్రత్తిపాడులో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. జానీమూన్ భర్త ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జానీమూన్ భర్త కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు మండిపడ్డారు. దీంతో గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.