dungal: కాసుల వర్షం కురిపిస్తోన్న ఆమిర్ ఖాన్ ‘దంగల్’.. మూడు రోజుల్లో వందకోట్లు ఖాయమంటున్న విశ్లేషకులు
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఆమిర్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను తీసుకొచ్చిన దంగల్.. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది. దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రభావం ఈ సినిమాపై ఏ మాత్రం పడడం లేదు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ 29.78 కోట్లు వసూలు చేసింది. ప్రేక్షకులతో సూపర్ హిట్ అనిపించుకుంటుండడంతో ఇక ఈ రోజు, రేపు కూడా భారీ కలెక్షన్లు పొందడం ఖాయమని సినీ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోతుందని అంటున్నారు.