: ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు దూరమైన షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ కు మోకాలి గాయం తిరగబెట్టడంతో దూరమైన షమీ, ఆ గాయం నుంచి కోలుకోకపోవడంతో సెలెక్టర్లు వన్డే సిరీస్ కు కూడా విశ్రాంతినిచ్చారు. దీంతో వచ్చే నెల 15 నుంచి ఇంగ్లండ్ తో ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కు షమీ దూరమయ్యాడు. దీంతో షమీ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోవాలని భావిస్తున్నప్పటికీ, విదేశీ జట్లపై మంచి ట్రాక్ రికార్డున్న సీనియర్ ఆశిష్ నెహ్రా కూడా పోటీలో వున్నాడు.