: నీతి, నిజాయతీ లేని వ్యక్తులు ఎంత సాధించినా నిష్ఫలం: పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్...సర్వమానవాళికి ప్రేమను పంచినప్పుడే శాంతి, సంతోషం, సమానత్వం అందుతాయని జీసస్ చెప్పారని గుర్తు చేశారు. నీతి, నిజాయతీ లేని వ్యక్తులు ఎంత సాధించినా నిష్ఫలమేనని పవన్ కల్యాణ్ తెలిపారు.