: యూపీని క్లీన్ స్వీప్ చేస్తాం: రాజ్ నాథ్ సింగ్
2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యూపీలోని లఖన్ పూర్ లో జరగనున్న బీజేపీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీ ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారం ఏర్పాటు చేస్తుందని అన్నారు. బీజేపీ పరివర్తన్ ర్యాలీ యూపీ అభివృద్ధికి సహకరిస్తుందని ఆయన చెప్పారు. నోట్ల రద్దు అంశం ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించిన అంశం కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అవినీతి, నల్లధనాన్ని రూపుమాపేందుకు తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు.